![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -520 లో..... నర్మద ప్రేమ ఇద్దరు వర్షము లో బట్టలు తీసుకొని వస్తుంటే వాళ్ళని వేదవతి గొడుగు పడుతుంది మీరు వర్షంలో తడిస్తే జ్వరం వస్తుందని వేదవతి అంటుంది. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటారు. అదంతా వల్లి చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత ప్రేమ ఇల్లు దుల్పుతుంటే ధీరజ్ వస్తాడు. తనతో ప్రేమ గా మాట్లాడతాడు. ఇద్దరు కలిసి ఇల్లు దుల్పుతారు.
ఆ తర్వాత ధీరజ్ , రామరాజు వేదవతి, అమూల్య నలుగురు కోర్ట్ లో హియరింగ్ కి వెళ్తారు. భద్రవతి విశ్వ , సేనాపతి, రేవతి కూడా వస్తారు. వాడికి ఈ రోజు శిక్ష పడాలని ధీరజ్ అనగానే తప్పకుండా జరుగుతుందని లాయర్ అంటాడు. జడ్జ్ వచ్చాక ఇద్దరు తరుపున లాయర్లు మాట్లాడుతారు. అమూల్యని విశ్వ ఇబ్బంది పెట్టినట్లు అమూల్య తరుపున లాయర్ మాట్లాడుతాడు. సాక్ష్యాలు చూపిస్తాడు.దాంతో జడ్జ్ అన్ని సాక్ష్యాలు చూసి విశ్వకి ఏడేళ్ళు జైలు శిక్ష అని చెప్తాడు. అప్పుడే ఒక్క నిమిషం ఆగండి అని అమూల్య అంటుంది. నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నానని అమూల్య అనగానే అందరు షాక్ అవుతారు. అతను నన్ను ఇబ్బంది పెట్టింది నిజమే కానీ ఇప్పుడు అతను జైలుకి వెళ్తే అతని ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతారో అలోచించి వద్దని అంటున్నానని అమూల్య చెప్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని అమూల్యతో ధీరజ్ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ అమూల్య అతని మాట వినదు.
దాంతో విశ్వపై ఉన్న కేసు కొట్టేస్తున్నట్లు జడ్జ్ చెప్తాడు. మరొకవైపు భాగ్యం దగ్గరికి వల్లి వెళ్లి చందు తనతో మాట్లాడిన విషయలు చెప్తుంది. నీ చేతులారా నువ్వే ఇదంతా చేసుకున్నావ్.. ముందే ఆ నర్మదని ఇంట్లో నుంచి పంపిస్తే ఇదంతా జరిగి ఉండకపోయేది అని భాగ్యం అనగానే నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడేలా చేస్తానని వల్లి అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |